L2 Empuraan : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీ రోల్ పోషించిన చిత్రం ఎల్ 2 ఎంపురాన్. ఇది గతంలో వచ్చిన , తను నటించిన చిత్రం లూసిఫర్ కు సీక్వెల్. దీనిని నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తీశాడు. ఎవరూ ఊహించని రీతిలో వసూళ్లలో కొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ మూవీ. విమర్శకుల నోళ్లు మూయిస్తూ ముందుకు వెళుతోంది. దీనిని దర్శకుడు పూర్తిగా యాక్షన్ , డ్రామాగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన రెండు మూవీస్ విడుదలయ్యాయి.
L2 Empuraan Sensational Collections
రెండూ బిగ్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తనతో పాటు శోభనతో కలిసి నటించిన తుడారుమ్ కూడా కలెక్షన్లలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇది ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లను దాటేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇక ఎల్ 2 ఎంపురాన్(L2 Empuraan) ప్రేక్షకుల హృదయాలను కట్టి పడేలా చేసింది. ఇందులో మంజు వారియర్ , టోవోనో థామస్ , వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్ లతో పాటు సూరజ్ నటించాడు. లైకా ప్రొడక్షన్స్ , గోకులం సినిమాస్ కలిసి ఆంథోనీ పెరుంబూర్ నిర్మించారు ఎల్ 2 ఎంపురాన్ మూవీని.